Tuesday, July 21, 2026
Homeవార్తలుతెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

TG: (ప్రభాత జాగృతి): పెద్దపెల్లి జిల్లా తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 16న నిర్వహించనున్న‌ట్లు ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, జిల్లా ఎన్నికల అధికారి చిలుక శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం పెద్దపెల్లి జిల్లాలో సభ్యత్వం తీసుకున్న కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్ సంస్థల పద్మశాలి ఉద్యోగులు ఈ నెల 16 న ఉదయం 10 గంటలకు జిల్లాలోని రామగిరి మండల కేంద్రం (మంథని-పెద్దపల్లి-గోదావరిఖని కూడలి) సెంటినరీ కాలనీలోని శ్రీపాద భవన్ ఆవరణలో జరిగే జిల్లా కమిటీ ఎన్నికలకు హాజరుకావాలని కోరారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు 23 మంది కార్యవర్గ కార్యవర్గం ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Related News

తాజా వార్తలు