కరీంనగర్: తిరుమల,తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.టి. శ్రీనివాస్‌ను టిటిడి ఉద్యోగులు,గ్రూప్ సూపర్వైజర్లు, శ్రీవారి సేవకులకు “ఆపరేషన్స్,సర్వీసెస్,ఆపరేషనల్ స్కిల్స్”పై బోధన చేయుటకు (2డిసెంబర్ 2025 టూ 4 ఫిబ్రవరి 2026) 20 బ్యాచులకు పైగా శిక్షణ అందించనున్నారు. అందులో భాగంగా 3వేల మందికిపైగా పాల్గొననున్నారు.
సేవా ప్రాంగణాలలో క్రమశిక్షణ,సేవాభావం,భక్తుల నిర్వహణ,కమ్యూనికేషన్, సమన్వయం,ప్రవర్తనా నియమాలు,టీమ్ వర్క్ కార్యనిర్వహణ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ శిక్షణలో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ అవకాశాన్ని దక్కించినందుకు డాక్టర్ శ్రీనివాస్ భగవంతుడు శ్రీవేంకటేశ్వర స్వామివారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ప్రత్యేకంగా టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ (ఐఏఎస్) ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా టిటిడి అందించే సేవలను మరింత సమర్ధవంతముగా తీర్చిదిద్దడం,సేవకుల సేవాభావాన్ని,నైపుణ్యాలను మెరుగు పరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.భవిష్యత్తులో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలియజేశారు.ఈ శిక్షణ కార్యక్రమాలను టీటీడీ,ఐఐఎం, అహ్మదాబాద్,ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లానింగ్ బోర్డు సంయుక్తముగా నిర్వహిస్తున్నారు.
అనంతరం ఐఏఎస్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిధిగా పాల్గొని రాబోయే రోజుల్లో శ్రీవారి సేవకుల వ్యవస్థను మరింత భలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాలు చేపట్టి,శ్రీవారి భక్తులకు అందించే సేవలు మెరుగుపరచాలని టీటీడీ ఆలోచన అని చెప్పారు.ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాముల నుంచి శ్రీవారి సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

