రాజన్న సిరిసిల్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌పై వేములవాడ తహసీల్దార్లు, ఎంపీఓలు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ట్రైనర్లు పీపీటీ ద్వారా మంగళవారం శిక్షణ ఇచ్చారు.
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుందని తెలిపారు. వారికి సంబంధిత అప్లికేషన్లు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, వాటిని ఎస్ఈసీ నిబంధనల ప్రకారం నింపి అందజేయాలని సూచించారు.
శిక్షణలో శిక్షణ నోడల్ అధికారి శేషాద్రి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి లక్ష్మీరాజం, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

