కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం “అన్నగారు వస్తారు” తెలుగు ప్రేక్షకుల ముందుకు సందడి చేయడానికి సిద్ధమైంది. తమిళంలో ‘వా వాతియార్’ పేరుతో తెరకెక్కిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ తెలుగు వెర్షన్ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందించిన ఈ చిత్రంలో కార్తీ పవర్ ఫుల్, ఫన్ లవింగ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సత్యరాజ్, ఆనంద్ రాజ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఫుల్ ఫన్, యాక్షన్ డోస్‌తో వస్తున్న ‘అన్నగారు’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

