టాలీవుడ్ నటి తులసి యాక్టింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి శంకరాభరణం సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం 4వ ఏట నుండే నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు.
ఆ తరవాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. ఎక్కువగా తల్లి, అత్త లాంటి క్యారెక్టర్లతో ఆమె ప్రేక్షకులను అలరించారు. ఇక తులసి కన్నడ దర్శకుడు శివమణిని వివాహం చేసుకోగా కొంతకాలం పాటు నటనకు దూరం అయ్యారు. తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చి వరుసపెట్టి సినిమాలు చేశారు.

