Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుసర్పంచ్‌కు 133, వార్డులకు 335 నామినేషన్లు

సర్పంచ్‌కు 133, వార్డులకు 335 నామినేషన్లు

కరీంనగర్‌: గన్నేరువరం మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. తొలి రోజు మందకొడిగా సాగిన నామినేషన్ల పర్వం, రెండోరోజు వేగం పుంజుకున్నది. మూడో రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్‌ కార్యాలయాల ఎదుట అభ్యర్థులు బారులు తీరారు. ఆదివారం మొదలైన నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మండలంలోని 17 గ్రామాల సర్పంచ్‌ స్థానాలకు 133, వార్డులకు 335 నామినేషన్లు దాఖలయ్యాయి.

గన్నేరువరం సర్పంచ్‌ స్థానాలకు 18, వార్డులకు 46, చొక్కారావుపల్లి సర్పంచ్‌ 5, వార్డులు 9, యాస్వాడ సర్పంచ్‌ 7, వార్డులు 10, చాకలివానిపల్లి సర్పంచ్‌ 10, వార్డులు 13, గునుకుల కొండాపూర్‌ సర్పంచ్‌ 12, వార్డులు 27, గుండ్లపల్లి ఎక్స్‌ రోడ్డు సర్పంచ్‌ 8, వార్డులు 22, గుండ్లపల్లి సర్పంచ్‌ 5, వార్డులు 19, చీమలకుంటపల్లి సర్పంచ్‌ 6, వార్డులు 23, హన్మాజిపల్లి సర్పంచ్‌ 10, వార్డులు 21,
మల్లారం సర్పంచ్‌ 7, వార్డులు 26, సాంబయ్యపల్లి సర్పంచ్‌ 7, వార్డులు 10, జంగపల్లి సర్పంచ్‌ 8, వార్డులు 29, గోపాల్‌పూర్‌ సర్పంచ్‌ 5, వార్డులు 11, పీచుపల్లి సర్పంచ్‌ 2, వార్డులు 6, ఖాసీంపేట్‌ సర్పంచ్‌ 11, వార్డులు 19, మాదాపూర్‌ సర్పంచ్‌ 7, వార్డులు 21, పారువెల్ల సర్పంచ్‌ స్థానానికి 5, వార్డు స్థానాలకు 13 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు.

నామినేషన్లను బుధవారం పరిశీలించి చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థులు అప్పీళ్లకు వెళ్లవచ్చు. 4వ తేదీన అప్పీల్‌ చేసుకుంటే, 5న సాయంత్రంలోగా పరిష్కరిస్తారు. 6న మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ప్రచారానికి 8 రోజుల గడువు ఉంటుంది. 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.

Related News

తాజా వార్తలు