సూపర్ స్టార్ రజనీకాంత్.. ఒక సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తి, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే దేశమంతా ఆరాధించే ‘తలైవా’ రజనీకాంత్‌గా మారి భారతీయ చలనచిత్ర రంగాన్ని ఏలుతున్నారు. రజనీ చలనచిత్ర రంగంలోకి వచ్చి అర్ధ శతాబ్దం (50 ఏళ్లు) పూర్తయినా, ఆయన స్టైల్, అద్భుతమైన ఎనర్జీ, మాస్ అప్పీల్ ఏ మాత్రం తగ్గలేదు.
చరిత్రలో తొలిసారి ‘హిందుస్తాన్ టైమ్స్’
రజనీకాంత్ సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ అరుదైన సందర్భంగా, ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘హిందుస్తాన్ టైమ్స్’ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ పత్రిక తమ వందేళ్ల చరిత్రలో తొలిసారిగా తమ మాస్టర్‌హెడ్ (ముఖ్య శీర్షిక) స్థానంలో రజనీ ఫోటోతో పాటు ‘రజనీకాంత్ టైమ్స్’ అని మార్పులు చేసింది.
ఒక సినీ నటుడి ఫోటోను తమ ఫ్రంట్‌పేజీలో ముద్రించి, పత్రిక పేరును కూడా మార్చిన తొలి పత్రికగా హిందుస్తాన్ టైమ్స్ నిలిచింది. ఇది రజనీకాంత్ దేశీయ సంస్కృతిపై చూపిన ప్రభావానికి దక్కిన అరుదైన గౌరవంగా నిలిచింది.

