Tuesday, July 21, 2026
HomeUncategorizedమత్తు నిర్మూలనే లక్ష్యంగా కృషి చేయాలి

మత్తు నిర్మూలనే లక్ష్యంగా కృషి చేయాలి

TG: మత్తు పదార్థాలు,ఆన్లైన్ బెట్టింగ్ ల నిర్మూలన ప్రజలందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ల్లో సిఐ సదన్ కుమార్,ఎస్సై రేణికుంట సాయికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితోపాటు ప్రజలతో కలిసి గంజాయి,మత్తు పదార్థాలు నిర్మూలించడంలో మన ఊరు మన బాధ్యత వాల్ పోస్ట‌ర్‌ను సోమవారం ఆవిష్కరించారు.

అనంతరం సీఐ మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ను నిర్ణయించే యువత మత్తు పదార్థాల బారినపడకుండా ఉండేందుకు సరఫరాదారులు, ఉత్పత్తిదారులపై ఉక్కుపాదం మొపే దిశగా ముందుకు వెళ్తున్నమన్నారు.గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించిన అమ్మిన,రవాణా చేసిన,సాగుచేసిన,ఆన్లైన్ బెట్టింగ్ ఆడిన, ఇతరులతో ఆడించిన తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ లను కేటాయించామని గ్రామంలో జరిగే కదలికలపై వారికి తగు సమాచారం అందిస్తూ సామాజిక బాధ్యతను నెరవేర్చాలన్నారు.

యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలందరిపై ఉందని,మత్తు పదార్థాలు సేవించిన వారి యూరిన్ టెస్ట్ చేసి నిమిషాల్లో పట్టుకుంటామని, ఎవరు తప్పించుకోలేరని సిఐ హెచ్చరించారు.కార్యక్రమంలో ఏఎస్ఐ తిరుపతి,పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు