Tuesday, July 21, 2026
Homeరాజకీయాలు42 శాతం రిజర్వేషన్ల సాధనే ధ్యేయం

42 శాతం రిజర్వేషన్ల సాధనే ధ్యేయం

TG:తాండూర్ (ప్రభాత జాగృతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీ దాకా అయినా వెళ్లి పోరాడుదామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష జరిగింది. కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ నేతలు దీక్షలో ఉన్నారు.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు నిరంతర ఉద్యమం చేద్దామని అన్నారు. రిజర్వేషను అమలు చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకవచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చేందుకు సీఎం చొరవచూపాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.

Related News

తాజా వార్తలు