Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుచివరి గింజ వ‌ర‌కు కొంటా: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

చివరి గింజ వ‌ర‌కు కొంటా: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

TG:వేములవాడ-(ప్రభాత జాగృతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తుల చివరి గింజ కొనుగోలు జ‌రిగే వ‌ర‌కూ రైతులకు అధికారులు అండగా ఉండాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు.

ఖరీఫ్ సీజన్ 2025- 2026 వరి, పత్తి, మక్కల కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు