Tuesday, July 21, 2026
Homeవార్తలుప్రజల సమస్యలు పరిష్కారం: ఎమ్మెల్యే సంజయ్

ప్రజల సమస్యలు పరిష్కారం: ఎమ్మెల్యే సంజయ్

కోరుట్ల: గుడ్ మార్నింగ్ కోరుట్ల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రెండవ వార్డుని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పర్యటించారు.వార్డులోని డ్రైనేజీ,రోడ్లు,శానిటేషన్ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.వార్డు ప్రాంతం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా రోజువారీ శుభ్రత చర్యలను మరింత బలోపేతం చేయాలని వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బందికి సూచించారు.

ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని త్వరిత పరిష్కారం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇటీవల మంజూరైన నిధులలో భాగంగా వార్డులో అవసరమైన పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మున్సిపల్ డీఈ, కమిషనర్‌లను ఆదేశించారు.వార్డులో పెండింగ్‌లో ఉన్న చిన్నపాటి పనులు కూడా వెంటనే పూర్తి చేసేలా తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

Related News

తాజా వార్తలు