Tuesday, July 21, 2026
Homeవార్తలుసేవామయంగా మల్క యశస్వి జన్మదిన వేడుకలు

సేవామయంగా మల్క యశస్వి జన్మదిన వేడుకలు

పెద్దపల్లి: ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి స్కూల్స్ సీఈఓ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కుమారుడు, యువ నాయకుడు మల్క యశస్వి జన్మదిన వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రంలో అంబరాన్నంటాయి. బీజేపీ నాయకులు, యశస్వి సేవా సమితి సభ్యులు, అభిమానులు భారీగా హాజరై ఈ వేడుకలను ఘనంగా, సేవామయంగా నిర్వహించారు.ఉదయం స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు, స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలోని విద్యార్థులకు అన్నదానం చేశారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేస్తూ యశస్వి సేవా సమితి సభ్యులు సేవా భావాన్ని ప్రతిబింబించారు.

ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. యశస్వి పటేల్ పార్టీ పునర్నిర్మాణంలో, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. విద్యారంగంలో సేవలు అందిస్తున్న ఆయన, రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం పార్టీకి బలాన్నిస్తోందని పేర్కొన్నారు.ఆయన నాయకత్వంలో యువతకు సరైన మార్గదర్శనం లభిస్తుందని, భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. యశస్వి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ, పార్టీ తరఫున మరియు అభిమానుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యశస్వి సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు