పెద్దపల్లి: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కొలిపాక నర్సయ్య హాజరై జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలపై దృష్టిసారించాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా మత్స్య కార్మికులకు ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన గుర్తుచేస్తూ.. చెరువులలో చేప సంపద పెంపు కోసం ఏటా కోట్లాదిగా చేప పిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ చేసిందని.. మత్స్యకారుల కోసం వలలు, మోపెడ్‌లు, ఆటోలు వంటి పరికరాలను 75శాతం సబ్సిడీపై అందించిందన్నారు. ముదిరాజ్ భవన నిర్మాణం కోసం హైదరాబాద్‌లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని,మత్స్యకారుల ప్రమాద బీమాను 6 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
మత్స్యకారుల జీవనోపాధి రక్షణ కోసం పంచాయతీ చెరువులను మత్స్య శాఖకు బదిలీ చేసిన నిర్ణయం కూడా ఎంతో ఉపయోగకరమైందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కలవేణి రాజయ్య, ఉపాధ్యక్షులు కలవేణి శ్రీనివాస్, కోశాధికారి చాట్ల సాధయ్య, డైరెక్టర్లు శనవేణి నాగరాజు, కలవేణి రాజు, కలవేణి ఓదెలు, కలవేణి రాము, కలవేణి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముదిరాజ్ నాయకులు కలవేణి సంపత్, కలవేణి శంకర్, చొప్పరి శంకర్, సబ్బు మల్లయ్య, కలవేణి రాజేశం, కలవేణి శ్రీనివాస్, యువకులు బాలసాని క్రాంతి, శ్రీనివాస్ రాజు హాజరయ్యారు.

