కోరుట్ల:ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ మెట్ పల్లి పట్టణంలోని MJPTBCWRS Boys రెసిడెన్షియల్ స్కూల్ ను సోమవారం ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు వివరంగా తెలుసుకున్నారు. విద్యార్థులు మెరుగైన పాఠాలు నేర్చుకుని, మంచి భవిష్యత్తు సాధించాలన్నారు.
వంటశాలను పరిశీలించి, భోజన నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.స్కూల్ ప్రాంగణం, హాస్టల్ గదులను పరిశీలించి, పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.ప్రిన్సిపాల్‌తో మాట్లాడి స్కూల్లో ఉన్న ఖాళీల భర్తీ, బోధన నాణ్యత గురించి సమగ్రంగా తెలుసుకొని,హాజరు పట్టికలు, రికార్డులను పరిశీలించి ప్రతి విద్యార్థి హాజరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

