TG:వేములవాడ మున్సిపల్ పరిధిలోని 8 వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని సోమవారం కాంగ్రెస్ నేతలు పని జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపూ రాకేష్ మాట్లాడుతూ.. సుమారు రూపాయలు 13 లక్షల నిధులతో సిసి రోడ్డు, డ్రైనేజీ పనులు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్ చొరవతో పనులు చేయడం జరుగుతుందని వారన్నారు. వేములవాడ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పనులకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. వేములవాడను వెన్నెల వాడగా తీర్చిదిద్దడం జరుగుతుందని.. అన్ని వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీ పనులకు నిధులు ఆది శీనన్న వెచ్చించడం జరిగిందని వారు గుర్తు చేశారు. వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంన్నందుకు కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు చెప్పారు.

