Tuesday, July 21, 2026
Homeవార్తలు15 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరో రీ-ఎంట్రీ!

15 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరో రీ-ఎంట్రీ!

బాలీవుడ్ స్టార్‌ అమీర్ ఖాన్ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. కానీ అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమైపోయాడు. పెళ్లి, విడాకులతో సతమతమైపోయిన ఇమ్రాన్.. డైవోర్స్ కారణంగా దాదాపు 15ఏళ్లు ఇండస్ట్రీలో లేకుండా పోయాడు. ఒకానొక టైమ్‌లో బాలీవుడ్ నుంచి క్విట్ అవుతున్నట్లు ప్రకటించాడు.

అయితే అదే హీరో ప్రస్తుతం కమ్ బ్యాక్ ఇస్తున్నట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. 2010లో చివరి సినిమా తీసిన ఆయన.. డైరెక్టర్ డానిష్ అస్లామ్‌తో 15ఏళ్ల తర్వాత ప్రాజెక్ట్ చేసినట్లు ప్రకటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ఓటీటీ డేట్ లాక్ కాగానే అనౌన్స్ చేస్తామని చెప్పాడు.

Related News

తాజా వార్తలు