పెద్దపల్లి:దుబ్బాక నియోజకవర్గంలోని చిట్టాపూర్ గ్రామం పెద్ద చెరువులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో కార్మిక,గనుల శాఖ మంత్రి డా.వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం 100శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యతో గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులకు అధిక ఆదాయం లభించి వారి జీవిత ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు.

