రాజన్న సిరిసిల్ల : ప్రభాత జాగృతి : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తెలంగాణలోని జిల్లాలకు అధ్యక్షులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధ్యక్ష పదవిపై పలు ఊహగానాలు సామాజిక మధ్యలో చక్కర్లు కొట్టాయి చివరికి జిల్లాలో సీనియర్ జాబితాలో ముందు వరుసలో ఉన్న సంగీతం శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్ష పదవి వరించింది.
1982 నుండి సంగీతం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్‌లో పని చేశారు. 2005లో సంగీతం శ్రీనివాస్ పార్టీకి చేస్తున్న సేవను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సంగీతం శ్రీనివాసును సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. 2023లో సాధారణ ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం ఎల్డిఎంగా సేవలందించి చొప్పదండి ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేశారు.
2023 జనరల్ ఎలక్షన్ సందర్భంగా టికెట్ ఆశించి పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టిపిసిసి కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచే ఆలోచనతో హై కమాండ్ సంగీతం శ్రీనివాస్‌కు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది.

