Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే గెలుపు

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే గెలుపు

TG:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగులేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తారని తెలిపారు.

శుక్రవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గడ్డ ..కాంగ్రెస్ అడ్డ అని ప్రజలు నిరూపించారన్నారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేశారనీ, వాటిని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పి కొట్టారని మండిపడ్డారు. మైనార్టీలు, సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీ యమ‌ని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలు పునరావృతం అవుతాయనీ, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఆయ‌న పేర్కొన్నారు.

Related News

తాజా వార్తలు