Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుబీహార్‌ విజయంపై బీజేపీ సంబురాలు

బీహార్‌ విజయంపై బీజేపీ సంబురాలు

TG : బీహార్‌ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 200కు పైగా సీట్లు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ గన్నేరువరం మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున సంబురాలు చేసుకున్నారు. బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్‌ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని, పటాకలు కాల్చి వేడుకలు జరుపుకొన్నారు.

ఈ సందర్భంగా బీహార్‌ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణలో కూడా రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వేడుకల్లో జిల్లా నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు మచ్చ బాలరాజు, మండల మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ మునిగంటి సత్తయ్య, నాయకులు పుల్లెల రాము, పుల్లెల జగన్‌, గూడూరి జగన్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ జీల కుమార్‌ యాదవ్‌, జాలి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రశాంత్‌, బుర్ర సత్తయ్య, అంజయ్య, బుర్ర ప్రణయ్‌, గూడూరి గణేశ్‌ పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు