TG:గన్నేరువరం: గుండ్లపల్లి-పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం మండల యువజన సంఘాలు ఈ నెల 16న గుండ్లపల్లిలో చేపట్టే మహాధర్నకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ ధర్నాకు భారీ సంఖ్యలో సీపీఐ శ్రేణులు, మండల ప్రజలు పార్టీలకతీతంగా నాయకులు తరలివచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చింది.

