రామగిరి :కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడులుగా మార్చడాన్ని నిరసిస్తూ ఆర్జి3 ఓసి1 సైట్ ఆఫీస్ లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఐఎన్టియుసి కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ అధ్యక్షతన ఏఐటియుసి, టీబీజీకేఎస్, సిఐటియు కార్మిక సంఘాలు నాయకులు జేఏసీగా ఉద్యోగులతో నల్ల జెండాలు ప్రదర్శించి నాలుగు లేబర్ కోడుల పత్రాలను కాల్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేయాలని గని మేనేజర్ రావుల పాపయ్యకు ఉద్యోగులతో కలిసి సింగరేణి చైర్మన్ కు అందజేయమని మెమొరాండం సమర్పించారు. బుధవారం కలెక్టర్ కు వినతి సమర్పణ, సింగరేణి జియం కార్యాలయాలలో ధర్నా, రోడ్ షో, నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సలీం, రామచందర్రావు, రవికుమార్, శ్రీనివాస్, నాగరాజు, రమేష్, రాజన్న, ఏఐటియూసి నాయకులు డిటి రావు, మల్లేష్ యాదవ్, టీబీజీకేఎస్ నాయకులు నాగేల్లి సాంబయ్య, పింగిలి సంపత్ రెడ్డి, అల్లం తిరుపతి, సిఐటియు నాయకులు జగదీష్, వేణు, గని ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

