Tuesday, July 21, 2026
Homeవార్తలుడీసీపీ సుడిగాలి పర్యటన.. పలు పోలీస్ స్టేషన్‌ల తనిఖీ

డీసీపీ సుడిగాలి పర్యటన.. పలు పోలీస్ స్టేషన్‌ల తనిఖీ

మంగళవారం కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను పెద్దపల్లి జోన్ డీసీపీ భూక్యా రామ్ రెడ్డి,గోదావరిఖని ఏసిపి ఎం.రమేష్‌తో కలిసి గోదావరిఖని సబ్ డివిజన్ లోని, గోదావరిఖని టూ టౌన్, కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. కమాన్ పూర్ స్టేషన్‌లో నమోదైన కేసులు,పెండింగ్ వ్యవహారాలు,పరిధిలోని సమస్యలు,నేరాల పరిస్థితిపై ఆయన వివరాలు సేకరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నక్క ప్రసాద్‌రావు,ఎస్ఐ కొట్టే ప్రసాద్ స్టేషన్ కార్యకలాపాలపై సమగ్ర వివరణ ఇచ్చారు.

పలు పోలీస్ స్టేషన్లలోని రికార్డులు, రిసెప్షన్ విధులు, పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ విధానం, డయల్‌100 స్పందన, సీసీ కెమెరాల పనితీరును ప్రత్యక్షంగా డిసిపి భూక్యరాంరెడ్డి పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పని చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజాభద్రత, నేరాల నియంత్రణలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Related News

తాజా వార్తలు