Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుకాంగ్రెస్ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు

కాంగ్రెస్ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు

రాజన్న సిరిసిల్ల: జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిసిసి మాజీ అధ్యక్షులు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. సంగీతం శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు. మొదటగా జిల్లా కార్యాలయంలో పూజలో కార్యక్రమంలో పాల్గొని పూర్వ డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సంగీతం శ్రీనివాస్ కు శాలువా కప్పి పుష్ప గుచ్చం ఇచ్చి సన్మానించారు. అనంతరం ఆది శ్రీనివాస్.. సంగీతం శ్రీనివాస్ కు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి వచ్చిన నాయకులు మరియు వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు వచ్చి సంగీతం శ్రీనివాసులు శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిసిసి ఆదేశాలను అనుసరించి క్షేత్రస్థాయిలో పార్టీని బలొపెతం చేసేందుకు కృషి చేయాలని సంగీతం శ్రీనివాసు కోరారు. అన్ని వర్గాలను కలుపుకుపోతు పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఇప్పటివరకు సహకరించిన మంత్రులకు ఎమ్మెల్యేలకు జిల్లాలోని నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

నూతన అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తనను గుర్తించి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిన పీసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్ని వర్గాలను కలుపుకపోతు పార్టీని ముందుకు తీసుకెళ్తానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సిరిసిల్ల బ్లాక్ అద్యక్షుడు సూర్య దేవరాజ్, ఎల్లారెడ్డిపేట బ్లాక్ అద్యక్షుడు దొమ్మటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రోండి రాజు, వేములవాడ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాసులు, జిల్లా ఆర్టిఏ మెoబర్ సంగీతం శ్రీనాథ్, చిందం శ్రీనివాస్ మైనార్టీ నాయకులు రియాజ్, హైమద్, ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజ్, నాలుక సత్యం, వంగ కిరణ్, రెడ్డి మల్ల భాను, మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ముడుపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు