Tuesday, July 21, 2026
Homeవార్తలుకరాటే పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

కరాటే పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

పెద్దపల్లి:సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే, కుంగ్ ఫు పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు సాధించారు.

ఈనెల 22న పెద్దపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే, కుంగ్ ఫు ఛాంపియన్ షిప్ పోటీల్లో ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు కట విభాగంలో A.తరుణ్, V.మనోబిరామ్ బంగారు పథకాలు సాధించగా.. కట విభాగంలో G.ధనుష్, M.సంచిత్, P.అభిరామ్ రజత పథకాలు సాధించారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ కనకేష్,విద్యార్థులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు