తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికారికంగా వేగం అందుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.దీంతో గ్రామపంచాయతీ స్థాయి ఎన్నికల కోసం అన్ని విభాగాలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వివరించింది. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న, రెండో విడత పోలింగ్ 14న, మూడో విడత పోలింగ్ 17న జరగనుంది. ప్రతి విడతకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా విడతలవారీగా నిర్వచించారు.
పెద్దపల్లి జిల్లాలో మొత్తం 263 గ్రామ పంచాయతీలు,2432 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత నామినేషన్ ప్రక్రియ నవంబర్ 27న ప్రారంభంకానుంది.ఈ విడతలో 99 గ్రామపంచాయతీలకు,896 వార్డుల కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో నవంబర్ 30న 73 గ్రామపంచాయతీలకు,684 వార్డులకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. మూడో విడత నామినేషన్లు డిసెంబర్ 3న చేపడతారు. ఈ విడతలో 91 గ్రామపంచాయతీలకు,852 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ప్రాశాసనిక యంత్రాంగం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, సామగ్రి పంపిణీ వంటి అన్ని అంశాలను దశలవారీగా సమన్వయం చేస్తూ మండల స్థాయికి సూచనలు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలపరిచే ఈ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరగేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని సంబంధిత శాఖలు స్పష్టం చేస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల వివరాలు పెద్దపల్లి జిల్లా పరిధిలోని గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడుదలకు సంబంధించిన కీలక గణాంకాలను అధికార యంత్రాంగం విడుదల చేసింది. మొత్తం 5 మండలాలలో నిర్వహించనున్న ఈ విడతలో 99 గ్రామపంచాయతీలు, 896 వార్డులు, అంతే సంఖ్యలో 896 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. వీటికోసం మొత్తం 101 వీటికోసం మొత్తం 101 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి రెవెన్యూ డివిజన్లోని శ్రీరాంపూర్ మండలంలో గ్రామపంచాయతీలు:24, వార్డులు :226, పోలింగ్ స్టేషన్లు :226, పోలింగ్ స్థానాలు :25. ఇక మంథని రెవెన్యూ డివిజన్ కు చెందిన మండలాలలో కమాన్ పూర్:9, గ్రామపంచాయతీలు:92, వార్డులు:92, పోలింగ్ స్టేషన్లు:10 పోలింగ్ స్థానాలు.రామగిరి: స్థానాలు. ముత్తారం: 15 గ్రామపంచాయతీలు, 138 వార్డులు, 138 పోలింగ్ స్టేషన్లు, 15 పోలింగ్ స్థానాలు.మంథని: 35 గ్రామపంచాయతీలు, 282 వార్డులు, 282 పోలింగ్ స్టేషన్లు, 35 పోలింగ్ స్థానాలు కలిపి తొలివిడత మొత్తం: గ్రామపంచాయతీలు : 99 వార్డులు: 896 పోలింగ్ స్టేషన్లు:896 పోలింగ్ స్థానాలు 101 జిల్లా ఎన్నికల శాఖ ఇప్పటికే ఏర్పాట్లను వేగవంతం చేస్తూ, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలను సమీక్షిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞప్తులు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

