Tuesday, July 21, 2026
Homeవార్తలురైతు సమస్యలపై ఉద్యమిస్తా: విజయ్ కుమార్

రైతు సమస్యలపై ఉద్యమిస్తా: విజయ్ కుమార్

రైతు రక్షణ సమితి సైదాపూర్ మండల అధ్యక్షుడిగా మండలంలోని ఎల్లంపల్లె గ్రామానికి చెందిన కోలే విజయ్ కుమార్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు,హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ లు నియామక పత్రాన్ని అందజేశారు.సైదాపూర్ మండలంలోని రైతులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు కిషన్ రావు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.తనపై నమ్మకంతో తనను మండల అధ్యక్షుడిగా నియమించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు కు,హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ కు, రైతన్నలకు ధన్యవాదాలు విజేయ్ కుమార్ తెలిపారు.

Related News

తాజా వార్తలు