HYD: హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఇ.విలియమ్స్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా నియమితులైన ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత బంజారా హిల్స్‌లోని నంది నగర్లో ఉన్న ఆయననివాసం లో భేటీ అయ్యారు.హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమలు అభివృద్ధిపై చర్చించ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ తో పాటు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా మినిస్టర్-కౌన్సిలర్ ఫర్ పొలిటికల్ అఫైర్స్ ఆరోన్ కోప్, ఎకనామిక్ అఫైర్స్ విభాగం నుండి మెరెడిత్ మెట్జ్లర్ తదితరులు పాల్గొన్నారు.

