Tuesday, July 21, 2026
Homeవార్తలుఅక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు

పెద్దపల్లి :అక్రమ ఇసుక రవాణా చేసేవారి పట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని మైన్స్ & జియాలజి శాఖ సహయ సంచాలకులు పి.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ధర్మారం మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. లారీతో పాటు బ్రిజా కార్ సీజ్ చేసి ధర్మారం పోలీస్ స్టేషన్కు అప్పగించామని అన్నారు.

జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలకు లోబడి అనుమతి ఉన్నవారు మాత్రమే ఇసుక రవాణా చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Related News

తాజా వార్తలు