Tuesday, July 21, 2026
Homeవార్తలుబాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి

TG: మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల్లి లోని బండారికుంట అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్య నేరమని ,బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ సుచరిత అన్నారు.

బాల్య వివాహా నిషేధ చట్టం 2006 గురించి వివరిస్తూ ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్ళి చేసుకున్నట్లయితే వాటి వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. బాల్యవివాహాల వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. హెల్ప్ లైన్ నంబర్స్ గురించి మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సుజాత, రేఖ, శైలజ పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు