HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు కొన్ని కారణాలవల్ల పార్టీని వీడి కారు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఒకటో వార్డు నేత బచ్చన్ రాజు తెలిపారు. ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరా గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేయడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు.
నియోజక వర్గంలోని నాలుగో వార్డు జేబీఎస్ వద్ద ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. దీంతో ఒకటో వార్డులో, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలోపేతం అయిందన్నారు. ఇలా ఉంటే గడిచిన 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో బచ్చన్ రాజ్కు అనుబంధం ఉందని నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంక్షేమ పథకాలు, నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటు న్నాయని ఎమ్మెల్యే వివరించారు.
ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు,నాలుగవ వార్డు కాంగ్రెస్ నేతలు, మహిళా నేతలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

