Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుభారత ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే శ్రీగణేష్

భారత ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్:భారతదేశానికి ఉక్కు మహిళగా,తొలి మహిళా ప్రధానిగా గుర్తింపు పొందిన నాయకురాలు ఇందిరా గాంధీ అని ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు. స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలవేసి నివాళ్ళు అర్పించారు.ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారని, భారతదేశం ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే లా తీర్చిదిద్దారని కొనియాడారు.

పాకిస్తాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. బ్యాంకులను జాతికి అంకితం చేసిన ఆమె పేద ప్రజలు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించారాని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని వివరించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ ఫోర్ అధ్యక్షుడు సత్యనారాయణ, మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు