Tuesday, July 21, 2026
Homeవార్తలువరుస దొంగతనాలతో జంకుతున్న జనం!

వరుస దొంగతనాలతో జంకుతున్న జనం!

రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరెణి కార్మికుడు కోంతం బాపు రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లగా, వారి ఇంటిపై దొంగల కన్ను పడింది.బుధవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన బాపు, తలుపు తాళం పగిలి ఉండటం గమనించి వెంటనే ఇంట్లో తనిఖీ చేశారు. బీరువాలో దాచిన రూ.15 వేలు నగదు ను అపహరించినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే రామగిరి పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడిన నిందితుల జాడ తెలుసుకోవడానికి డాగ్ స్క్వాడ్ బృందం కూడా రంగంలోకి దిగింది.

కొద్ది రోజుల్లోనే కల్వచర్ల గ్రామంలో వరుసగా మూడు చోరీలు చోటుచేసుకోవడంతో, ఇంటి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లడానికే కూడా ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. గ్రామస్తులు పోలీసులు రాత్రి గస్తీ పెంచి దొంగతనాలకు తెరపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related News

తాజా వార్తలు