Tuesday, July 21, 2026
Homeవార్తలుడ్రగ్స్ నష్టాలపై ప్రచారం కల్పించాలి

డ్రగ్స్ నష్టాలపై ప్రచారం కల్పించాలి

పెద్దపల్లి:డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు,నష్టాలపై జిల్లాలో ప్రచారం కల్పించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు.సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాలు,డ్రగ్స్ నియంత్రణ కు చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో శనివారం స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు,గంజాయి సాగు నివారణ చర్యలు, మాద‌క ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, వంటి అంశాలపై చర్చించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు, ఇంటర్ పిల్లలకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు.

జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు,మోడల్ పాఠశాలలు,వసతి గృహాలు,గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్,మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ,జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రకాష్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు