బాలయ్య–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘అఖండ 2:తాండవం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ 3డి ఫార్మాట్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు.ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తోన్న ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రెండ్ సృష్టిస్తున్న నేపథ్యంలో.. అఖండ 2:తాండవం’పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

