హీరో రామ్ పోతినేని-భాగ్యశ్రీ బోర్సే జంటగా మహేశ్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆంధ్రాకింగ్ తాలూకా’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేనీ, రవిశంకరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ ట్రైలర్ ఈనెల 18న రాబోతున్నట్లు తెలుపుతూ.. రామ్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో ఆయన సైకిల్‌ను ఎత్తి భుజంపై పెట్టుకుని ఓ పెద్ద చెట్టు వెనకాల నుంచి మెట్లపై నడుచుకుంటూ వస్తున్నట్లు ఉన్న స్టైలీష్ లుక్‌లో కనిపించారు.

