Tuesday, July 21, 2026
Homeవార్తలుఅధికారుల తీరుపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం

అధికారుల తీరుపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం

పెద్దపల్లి:గత సంవత్సరకాలం నుండి ఎంపీ వంశీకృష్ణ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తో జరిపిన చర్చల ఫలితాల వలన కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించింది.
ఈ క్రమంలో ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు ఎంపీ వంశీకృష్ణ వచ్చారు.

అయితే అధికారులు ఆసుపత్రి స్థలంలో ఎలాంటి ఏర్పాటు చేయలేదు.దీంతో అధికారుల తీరుపై ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఎంపీని అధికారులు అవమానపరిచారని ఆరోపిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ తో పాటు, ఈఎస్ఐ అధికారులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన కార్మికుల సౌకర్యం ఆసుపత్రిని తీసుకువస్తానని వంశీకృష్ణ తెలిపారు.

Related News

తాజా వార్తలు