Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుదంపతులకు ఎమ్మెల్యే ఆశీర్వాదం

దంపతులకు ఎమ్మెల్యే ఆశీర్వాదం

గన్నేరువరం, ప్రభాత జాగృతి : కాంగ్రెస్ గన్నేరువరం మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి వివాహం శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, అనురాధ (అంకిత హాస్పిటల్స్ ఎం డీ) దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉపేందర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపి వారు కలకాలం సుఖసంతోషాలతో.. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అకాక్షించారు. వేడుకలో గన్నేరువరం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు