Tuesday, July 21, 2026
Homeవార్తలుభారీ వర్షాలకు 15 ఎకరాల్లో వరి పంట నష్టపోయిన కౌలు రైతు

భారీ వర్షాలకు 15 ఎకరాల్లో వరి పంట నష్టపోయిన కౌలు రైతు

చిగురుమామిడి: రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు 15ఎకరాల్లో వేసిన వరి పంట పూర్తిగా నేలమట్టం అయిందని,ప్రభుత్వం సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన కౌలు రైతు పేరాల తిరుపతిరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లక్షలాది రూపాయల అప్పుచేసి పెట్టుబడి పెట్టి రెండు రోజుల్లో కోత కోసి ఇంటికి రావలసిన వరి పంట నీటిలో మునిగి మొలకెత్తుతుందని దీంతో సర్వం నష్టపోయామని బాధిత కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు అధికారులు ఎవ్వరు వచ్చి నష్టపోయిన తమ పంటపై సర్వే చేయలేదని రైతు దంపతులు తెలిపారు.ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలకు తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని కంటతడి పెట్టారు.తాము మొత్తం 25ఎకరాల్లో వరి పంట వేశానని రైతు పేర్కొన్నారు. నష్టపోయిన బాధిత రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దొబ్బల బాబు ప్రభుత్వాన్ని కోరారు.

Related News

తాజా వార్తలు