Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ఆధిక్యంలో కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ తొలి రౌండ్ నుంచే తన హవాను కొనసాగిస్తూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ కనిపించినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని గణనీయంగా పెంచుకుంటూ పోయింది. ఇప్పటివరకు 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నారు.

నవీన్ యాదవ్‌కు విజయం ఖాయం!
నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి 9,147 ఓట్ల లీడ్‌ను కైవసం చేసుకున్న కాంగ్రెస్, ఐదవ రౌండ్ ముగిసే సమయానికి ఏకంగా 12,700 ఓట్ల లీడ్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 22 వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Related News

తాజా వార్తలు