TG: నల్లగొండ జిల్లాలో నేటి నుంచి జాగృతి జనం బాటను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు మంగళవారం ఉదయం 9 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని కిష్టారంపల్లి ప్రాజెక్టును జాగృతి నేతలతో కలిసి సందర్శిస్తారు. లక్ష్మన్నపురంలో ముంపు బాధిత రైతులతో సమావేశం కానున్నారు.11.30 గంటలకు దేవరకొండ కొమ్మపల్లి గురుకుల పాఠశాలను సందర్శిస్తారు.
మధ్యాహ్నం 1గంటకు నక్కలగండి ప్రాజెక్టును సందర్శించి ముంపు బాధితులతో సమావేశమవుతారు. 3 గంటలకు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వరద తాకిడికి కూలిపోయిన సుంకిశాల రిటైనింగ్ వాల్‌ను పరిశీలిస్తారు. 4 గంటలకు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్ ప్రాజెక్టు (లిఫ్ట్ ఇరిగేషన్)ను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు మిర్యాలగూడ పట్టణంలో జాగృతిలో పలువురు చేరనుండగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు.

