Tuesday, July 21, 2026
Homeరాజకీయాలునల్లమల గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తాం: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

నల్లమల గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తాం: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అమ్రాబాద్ మండలం, వటువర్ల పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు కర్నాటి శ్రీనివాసులుతో పాటు పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నేడు బీజేపీలో చేరారు. వారికి అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

గువ్వల బాలరాజు గారూ మాట్లాడుతూ..నల్లమల అచ్చంపేట గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేస్తామని గువ్వల బాలరాజు గారు ధీమా వ్యక్తం చేశారు.జూబ్లీహిల్స్ గెలిచిన మురిపంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు.బీహార్‌లో కాంగ్రెస్ కేవలం 6 సీట్లలో గెలిచి జాతీయ పార్టీ ఉనికిని కోల్పోయిందని గుర్తుచేశారు.రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీహార్ మాదిరిగా అధికారం లోకి వస్తుంది అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మంగ్య నాయక్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజ్ గారు, మండల ఎన్నికల ఇంచార్జ్ జానకి గారు, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, మహేందర్ గారు, శంకర్ మాదిగ గారు గోలి రాజ్, అనిల్, శంకర్,తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు