పెద్దపల్లి: జిల్లా కేంద్రం పెద్దపల్లి పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు బుధవారం నాడు పెద్దపల్లి జిల్లా బిసి జెఎసి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఈ కార్యక్రమానికి అనేక బిసి సంఘాల సభ్యులు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా బిసి జేఏసీ చైర్మన్ దాసరి ఉష మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి గతంలో పరితపించి బిజెపి, కాంగ్రెస్ పార్టీలే మద్దతు పలకడం జరిగిందని బిఆర్ఎస్, ఇతర పక్షాలు అధికార పార్టీలన్నీ కూడా కలిసి మద్దతు పలికిన తర్వాత ఈ రాష్ట్రం నలుమూలల పెద్ద ధర్నా ఏర్పాటు చేసుకొని షాపులను మూసి వేయడం జరిగిందని తెలిపారు.
ఆ తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తుంటే ఆ ఆశను వమ్ముచేసి నేడు జీవో 9ని రద్దుచేసి జీవో 46 తీసుకొని వచ్చి బీసీలను బలి చేస్తున్నారని.. 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తున్నారని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండితనాన్ని వీడి తక్షణమే రద్దు చేసిన జీవో 9 ని అమలు చేయాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని, లేనిపక్షంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని దాసరి ఉష హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ జే ఏసి జిల్లా వర్కింగ్ చైర్మన్ నల్లవెల్లి శంకర్, ki వైస్ చైర్మన్ కొండి సతీష్, జిల్లా మరియు మండల కన్వీనర్లు సలేంద్ర కొమురయ్య, భూమేష్ ,రాజయ్య యాదవ్ కన్న రమేష్ గౌడ్, తోట రాజ్ కుమార్ శ్రీధర్ భూమయ్య, కొండయ్య, రాజేందర్, అశోక్, రమేష్, కలయిన రాజేందర్ లు పాల్గొన్నారు.

