Wednesday, July 22, 2026
Homeవార్తలురోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

కాల్వ శ్రీరాంపూర్: ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించాలని మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ అన్నారు. బుధవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సారయ్య గౌడ్ సందర్శించారు.

ఈ సందర్భంగా హాస్పిటల్లోని సౌకర్యాలను పరిశీలించి డాక్టర్, వైద్య సిబ్బందితో మాట్లాడి హాస్పిటల్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని.. అలాగే ఆసుపత్రికి వచ్చే ప్రజలకు సరైన వైద్యాన్ని సకాలంలో అందించాలని తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలి అని డాక్టర్లకు,నర్సులకు, సూచించారు. ఈ సందర్శనలో కూనారం మాజీ ఎంపీటీసీ సాధనవేన కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు