TG: కోరుట్ల మున్సిపాలిటీలో వాహనాల వినియోగం, ఇంధన ఖర్చులు, బిల్లుల విధానంపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాలని కటుకం.చంద్రశేఖర్ అనే యువకుడు బుధవారం ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా అధికారులను కోరారు.
2025 జూన్ 27 నుంచి మున్సిపల్ కమీషనర్ గా రవిందర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తాము అడిగిన వివరాలు కావాలని విన్నవించుకున్నారు. మున్సిపాల్టీ వద్ద ప్రస్తుతం ఎన్ని వాహనాలు ఉన్నాయో, వాటి వినియోగానికి 2025 జూన్ 27 నుంచి ఇప్పటివరకు ఎంత పెట్రోలు, డీజిల్ వాడారో పూర్తి లెక్కలతో వెల్లడించాలని అభ్యర్థించారు.
ప్రతి వాహనానికి జరిగిన మరమ్మత్తుల వివరాలు, ఖర్చుల రికార్డులను కూడా అందించాలని కోరుతూ, ఇంధన కొనుగోలుకు కంప్యూటర్ బిల్లులు అందుబాటులో ఉన్నప్పటికీ.. మున్సిపాల్టీ ఎందుకు మాన్యువల్ బిల్లులనే తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ట్రాక్టర్లు, ఆటోలు, స్వీపింగ్ మెషిన్ల ఎన్ని ఉన్నాయో తెలియాలి దరఖాస్తులో ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ అధికారులు ఏ ప్రక్రియను అనుసరిస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

