Wednesday, July 22, 2026
Homeవార్తలు'హలో మాల.. ఛలో ఢిల్లీ'ని విజయవంతం చేయండి!

‘హలో మాల.. ఛలో ఢిల్లీ’ని విజయవంతం చేయండి!

కమాన్ పూర్: ఈ నెల 26 న హలో మాల… చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు సంఘం నాయకులు కోరారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బుధవారం భారత రాజ్యాంగ రచయిత డా, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు హలో మాల.. ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాల మహానాడు నాయకులు మాట్లాడారు.

భారత రాజ్యాంగ పరిరక్షణకు ఎస్సీల రిజర్వేషన్ కొరకు మాలలకు జరుగుతున్న అన్యాయాల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు మంథని నియోజకవర్గం ఇంచార్జి కందుగుల రాజన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాల పోచమల్లయ్య, మాల మహానాడు నాయకులు మట్ట రాజయ్య, దాసరి రామస్వామి, కొండ వెంకటేష్, డబ్బేట రాజేష్, మట్ట నర్సయ్య, పూరేళ్ళ రాజేష్, రాజేందర్, చీటీ తిరుపతి, కందుల రాజయ్య, పోచమల్లయ్య, అంబటి కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు