కోరుట్ల, మెట్ పల్లి పట్టణల్లో గల వ్యవసాయ మార్కెట్ యార్డులను బుధవారం కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు.
మా సమస్యలు పరిష్కరించండి
మొక్కజొన్న పంటను విక్రయించి దాదాపు 20 రోజులు పైన అయినా చెల్లింపులు జరగలేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న కొన్ని విధానాలు కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ, ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు.
ప్రభుత్వం నూతన విధానాల వల్ల ఇబ్బంది
వేలిముద్ర విధానం వల్ల రైతుల పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, కొనుగోలు కేంద్రాల అవసరమైన సిబ్బంది యంత్రాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని, ధాన్యం కొలిచిన వెంటనే డిజిటల్ ఎంట్రీలు పూర్తి చేసి చేలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని, మార్కెట్ యార్డులో పారిశుధ్యం, తుక యంత్రాల పనితీరు, గోదాంల పరిస్థితిలపై చర్చించారు.
త్వరలోనే సమస్యల పరిష్కారం
మార్కెట్ యార్డుల ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రైతుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

