Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుఇందిరా గాంధీ జయంతి వేడుకలు!

ఇందిరా గాంధీ జయంతి వేడుకలు!

కమాన్ పూర్: భారత మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరా గాంధీ 108 వ జయంతి వేడుకలు బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ సయీద్ అన్వర్, ఏ.ఎం.సి చైర్మన్ వైనాల రాజు కేక్ కట్ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది అంటే మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ పరిపాలన విధానం అన్నారు. గరీబి హటావో నినాదంతో దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఎంతగానో తోడ్పడడం జరిగింది. ఆ మహనీయురాలు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గూడులేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్ళను కల్పించి గూడు కట్టించడం, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించి కూడు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరాగాంధీ ఆశయ సాధనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో రంగు సత్యనారాయణ, మల్యాల తిరుపతి, సయ్యద్ ఇక్బాల్, గడప కృష్ణమూర్తి, దాసరి గట్టయ్య, బొంపల్లి రాజయ్య, తిరుపతి గౌడ్,కమ్మగొని మల్లయ్య, మహేష్ గౌడ్, లక్ష్మీరాజo, రవి, బోనాల సత్యం, రామస్వామి,సాగర్, నరసయ్య, రాజేష్,కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు