బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ 2.ఇందులో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా నుంచి జాజికాయ జాజికాయ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోలు రిలీజ్ చేశారు. ఇక ఇందులో సంయుక్తతో అదిరిపోయే స్టెప్పులు వేసి దుమ్ము లేపాడు బాలయ్య. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు.

