ప్రభాత జాగృతి, కరీంనగర్:అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో హాలోవీన్ వేడుకలు ఉత్సాహభరితంగా మరియు ఆనందపూర్వకంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల అంతటా హాలోవీన్ థీమ్‌తో అలంకరించబడిన అందమైన డెకర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ప్రీ-ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులు పాల్గొన్న థీమ్-బేస్డ్ కాస్ట్యూమ్ ర్యాంప్ వాక్ నిలిచింది. పిల్లలు తమ సృజనాత్మకతను, ధైర్యాన్ని మరియు ఉత్సాహాన్ని అద్భుతమైన వేషధారణల ద్వారా ప్రదర్శించారు. విద్యార్థులు హాలోవీన్ యొక్క ప్రాముఖ్యత మరియు చరిత్రపై ప్రసంగాలు చేయగా, డాన్స్ ప్రదర్శనలు కార్యక్రమానికి మరింత చైతన్యం నింపాయి. విద్యార్థులు వివిధ దేశాల సంస్కృతులను అవగాహన చేసుకోవడం (గ్లోబలైజేషన్), వాటిని గౌరవించడం మరియు ప్రపంచ పౌరులుగా ఎదగడం ఎంత ముఖ్యమో స్కూల్ ప్రాముఖ్యతగా తెలిపింది.
స్కూల్ చైర్మన్ శ్రీ కోమరయ్య సౌగాని, డైరెక్టర్ శ్రీ అనుదీప్ సౌగాని, ప్రిన్సిపల్ శ్రీమతి మాధురి శ్వేత, వైస్ ప్రిన్సిపల్.. విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందిస్తూ తమ ప్రేరణాత్మక మాటలను పంచుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆర్ట్, డాన్స్ విభాగాలు, పి.ఇ.టీ.లు, అడ్మిన్ టీమ్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుక అద్విత కుటుంబంలోని సృజనాత్మకత, ఐక్యత, ఆనందం, గ్లోబల్ లెర్నింగ్ స్పిరిట్‌ను ప్రతిబింబించింది.

